వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..! 1 d ago

featured-image

AP : అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, అప్రమత్తతపై సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు.. స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎంకు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరేలా చూడాలని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD